Home South Zone Andhra Pradesh ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఎంపీ దంపతుల ప్రత్యేక పూజలు.

ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఎంపీ దంపతుల ప్రత్యేక పూజలు.

0

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శనివారం జరిగిన మహా కుంభాభిషేక మహోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్, జానకి లక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ రాజగోపుర దర్శనం అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిష్టాత్మకమైన క్రతువులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆలయ ఈవో, చైర్మన్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వెంకట రాఘవ రాజు, పద్మావతి, కళావతి, సరిత, శంకర్ బాబు మరియు టిఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చేస్తున్న కృషిని ఎంపీ అభినందించారు. అమ్మవారి కృపతో అందరికీ శుభం కలగాలని ఆయన ఆకాంక్షించారు.

NO COMMENTS

Exit mobile version