రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి చేతకానితనమే కారణమని మంత్రులు నిమ్మల, పయ్యావుల, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
2020లోనే ఎన్జీటీ ఆదేశాలతో పనులు ఆగిపోయినా, నాటి ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని మండిపడ్డారు.
ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన వైసీపీ, ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటని.. తమ ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ. 10,014 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు.
