నారా లోకేశ్ ఆవేదన: ‘నాగభూషణం మృతి తీరని లోటు’.

0
0

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విజయవాడలో పార్టీ బలోపేతానికి నాగభూషణం చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ లోకేశ్ సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత సందేశాన్ని పోస్ట్ చేశారు.

‘భూషణం’ అని పిలవగానే ముందుండే తమ్ముడిని కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.