మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండికి చెందిన గిరిజన యువతి తాటి కృష్ణవేణి చరిత్ర సృష్టించింది.
తన ప్రతిభతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) జట్టులో చోటు సంపాదించి, బిసిసిఐ (BCCI) జాతీయ స్థాయి వన్డే టోర్నీకి ఎంపికైంది.
కృష్ణవేణి కృషిని గుర్తించిన మంత్రి సీతక్క ఆమెకు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించిన కృష్ణవేణిని స్థానిక నాయకులు ఘనంగా సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
