Home South Zone Telangana గాంధీ చౌక్ మసీదు ఇమామ్ సేవలు మరువలేనివి: భక్తుల నివాళి.

గాంధీ చౌక్ మసీదు ఇమామ్ సేవలు మరువలేనివి: భక్తుల నివాళి.

0

నిజామాబాద్ నగరం గాంధీ చౌక్‌లోని ప్రసిద్ధ మస్జిద్-ఎ-కచియా ఇమామ్, ప్రముఖ ధార్మిక పండితుడు మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మరియు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తారావీ నమాజ్ అనంతరం రాత్రి 11 గంటల సమయంలో నెహ్రూ పార్క్ సమీపంలోని ఖబ్రస్థాన్‌లో నమాజ్-ఎ-జానాజా నిర్వహించారు. ఈ అంతిమ ప్రార్థనలో వేలాది మంది ప్రజలు పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. దశాబ్దాల పాటు మస్జిద్-ఎ-కచియాలో ఇమామ్‌గా ఉంటూ ఆయన అందించిన ధార్మిక సేవలు, ముఖ్యంగా రంజాన్ మాసంలో ఆయన నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు చిరస్మరణీయమని భక్తులు గుర్తుచేసుకున్నారు.

NO COMMENTS

Exit mobile version