హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను నిజాయితీగా తిరిగి అందించిన ఆటో డ్రైవర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిబ్రవరి 26, 2026 తెల్లవారుజామున సుమారు ఉదయం 5.30 గంటల సమయంలో బెంగుళూరు నుంచి వచ్చిన లక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడి నుంచి ఆమె దిల్సుఖ్ నగర్ లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో రిక్షాను వినియోగించారు.
ఆమెను తన ఇంటి వద్ద దింపిన తర్వాత ఆటోలో ఆమె పర్స్ మరిచిపోయిన పర్స్ గమనించిన ఆటో డ్రైవర్ చింతల శ్రీనివాస్ ముదిరాజ్ వెంటనే తిరిగి ఆమె ఇంటికి వెళ్ళి మనీ పర్స్‌తో పాటు అందులో ఉన్న విలువైన బంగారు నెక్లేస్ మరియు మరో చైన్స్ సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలను యథాతథంగా అప్పగించారు.
డ్రైవర్ నిజాయితీపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. డ్రైవర్ శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి, ₹5000 నగదుని అందచేశారు. తమ విలువైన అవధారణాలను అందజేసిన డ్రైవర్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇలాంటి నిజాయితీ గల వ్యక్తుల వల్ల ఆటో డ్రైవర్ల సమాజంపై ఉండడం వారిపై గౌరవం మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు.
#sidhumaroju
Alwal










