Home South Zone Andhra Pradesh మార్చి 4న ‘చలో విజయవాడ’.. పుంగనూరులో జర్నలిస్టుల సమరశంఖం.

మార్చి 4న ‘చలో విజయవాడ’.. పుంగనూరులో జర్నలిస్టుల సమరశంఖం.

0

పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF) ఆధ్వర్యంలో గురువారం ‘చలో విజయవాడ’ కరపత్రాలను మరియు పోస్టర్లను ఆవిష్కరించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 4న విజయవాడలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం ముఖ్య నాయకులు డాక్టర్ తల్లా శ్రీనివాస్, ఖలీఫ్ భాష ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం ఎల్లప్పుడూ పోరాడుతుందని, నియోజకవర్గంలోని జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి జర్నలిస్టు నాయకులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version