నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానానికి బాపట్లకు చెందిన మాధవి కుటుంబ సభ్యులు భారీ విరాళం సమర్పించారు.
స్వామివారికి 43 గ్రాముల బంగారంతో రూపొందించిన త్రిశూలం, ఢమరుకం కలిగిన రుద్రాక్షమాలతో పాటు, 30 గ్రాముల బంగారు హారాన్ని అందజేశారు.
ఆలయ ఆశీర్వచన మండపంలో అధికారులకు వీటిని అందజేయగా, అర్చకులు దాతలకు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తుల ఈ ఉదారతపై ఆలయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
