సైబర్ కేటుగాళ్ల ప్లాన్ అవుట్: వీడియో కాల్‌లోకి వచ్చిన చిలకలపూడి సీఐ.

0
0

మచిలీపట్నంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్ల ప్లాన్‌ను చిలకలపూడి పోలీసులు భగ్నం చేశారు. ఈడేపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి హరినాథ్‌కు వీడియో కాల్ చేసిన కేటుగాళ్లు..

తాము ఏటీఎస్ అధికారులమని, వారిని ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కాల్‌ నడుస్తుండగానే చిలకలపూడి సీఐ అబ్దుల్ నబీ నేరుగా వీడియోలోకి రావడంతో నేరగాళ్లు భయంతో ఫోన్ కట్ చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ మోసాన్ని నివారించారు.