పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం ఆమినిగుంట సమీపంలోని పులికోన వద్ద శుక్రవారం క్షుద్ర పూజలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
ఘటనా స్థలంలో రక్తం చిందించి ఉండటం, నిమ్మకాయలు, రంగురంగుల అక్షింతలు, పూజా సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ పూజలు నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
# కొత్తూరు మురళి.
