Home South Zone Andhra Pradesh పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన

పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన

0

పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. ఆర్ అశోక్ మాట్లాడుతూ, స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్-లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన అన్నారు. వెంటనే స్పందించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version