జిల్లాలో నీట్ సెంటర్ల ఖరారు.. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష.

0
0

మే 3న నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్ష కోసం జిల్లాలో 6 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వెల్లడించారు.

గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అయ్యప్పనగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్, జేఎన్‌టీయూ (JNTU) బ్లాక్ 1 & 2, మరియు ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లను కేంద్రాలుగా గుర్తించామన్నారు.

ఈ కేంద్రాల్లో మొత్తం 1800 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

#BOIENA RAJESH