Home South Zone Andhra Pradesh నిజాయితీ చాటుకున్న దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్.. ఈవో అభినందనలు.

నిజాయితీ చాటుకున్న దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్.. ఈవో అభినందనలు.

0

విజయవాడ దుర్గగుడిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డ్ తన నిజాయితీని చాటుకున్నారు. గుణదలకు చెందిన భక్తురాలు క్యూలైన్‌లో పోగొట్టుకున్న బంగారు బ్రాస్‌లెట్‌ను గుర్తించి, దానిని అధికారుల సమక్షంలో తిరిగి అందజేశారు.

ఈమె అంకితభావాన్ని మెచ్చుకున్న ఆలయ ఈవో శీనా నాయక్ శనివారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పురస్కారంగా పట్టుచీర, నగదు అందజేసి ప్రశంసించారు. ఈ ఘటన ఇతర సిబ్బందిలో బాధ్యతను పెంపొందించేలా ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

NO COMMENTS

Exit mobile version