మదనపల్లి బి.టి. కళాశాలలో శుక్రవారం ‘విశాలాంధ్ర సంచారక పుస్తకాలయం’ ఘనంగా ప్రారంభమైంది. వైస్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి దీనిని ప్రారంభిస్తూ, ప్రపంచ గతిని మార్చే శక్తి ఒక్క పుస్తకానికే ఉందని కొనియాడారు.
నేటి డిజిటల్ యుగంలో యువత పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, శాస్త్ర సాంకేతిక విప్లవానికి గ్రంథాలే పునాదులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు సాంబశివ, మురళి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.










