Home South Zone Andhra Pradesh బుద్ధునికొండ రక్షణే లక్ష్యం.. ఢిల్లీకి పయనమవుతున్న బౌద్ధ ఉపాసకులు.

బుద్ధునికొండ రక్షణే లక్ష్యం.. ఢిల్లీకి పయనమవుతున్న బౌద్ధ ఉపాసకులు.

0

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని చారిత్రాత్మక బుద్ధునికొండ పరిరక్షణ ధ్యేయంగా మార్చి 10న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా భిక్ఖు సంఘం (ఏపీ, తెలంగాణ) ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత ప్రకటించారు.

గురువారం మదనపల్లె స్థానిక అతిథి భవనంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మన బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ పోరాటంలో బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు మరియు అంబేడ్కరీయులు పెద్ద ఎత్తున పాల్గొని ఢిల్లీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

NO COMMENTS

Exit mobile version