మదనపల్లిలో కలకలం.. హంద్రీ-నీవా కాలువ వద్ద శవం లభ్యం.

0
0

మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ సమీపంలో శుక్రవారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

150వ మైలు వద్ద ఉన్న చిన్న గుంతలో ఈ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఎవరో హత్య చేసి ఇక్కడ పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల సేకరణ కోసం శనివారం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.