Home South Zone Telangana కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|

కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలిశారు. కాలనీలో ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధానంగా వీధి దీపాల నిర్వహణ, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మల ప్రూనింగ్, విద్యుత్ సరఫరా మెరుగుదలకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పార్కు సుందరీకరణ మరియు సిసి రోడ్ల ఆవశ్యకతపై సుదీర్ఘంగా చర్చించారు.

కాలనీ వాసుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి , వెంటనే సంబంధిత విభాగాల అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కిష్టమ్మ ఎన్క్లేవ్ నూతన కమిటీ అధ్యక్షుడు బి. ఉమేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు ఆనంద్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ఉమా మహేశ్వర రావు, కోశాధికారి ఆర్. చిరంజీవి, జాయింట్ సెక్రటరీ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించినందుకు కమిటీ సభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

#Sidhumaroju
ఆల్వాల్

NO COMMENTS

Exit mobile version