Home South Zone Andhra Pradesh అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.

అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.

0

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు ‘మహిళా సాధికారత వారోత్సవాలను’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం తెలిపారు.

ఈ వారం రోజుల పాటు విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, ఆరోగ్య శిబిరాలు, ఆత్మరక్షణ శిక్షణ, ఫ్లాష్ మాబ్స్, పోలీస్ స్టేషన్ల సందర్శన, ఆటల పోటీలు, ముగింపు వేడుకలు, బహుమతుల ప్రదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ 24/7 అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Exit mobile version