Home South Zone Andhra Pradesh దోర్నాల వద్ద రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు.

దోర్నాల వద్ద రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు.

0

మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం బొమ్మలాపురంతుమ్మలపల్లి మూల మలుపు వద్ద చిన్న దోర్నాల నుండి మిర్చి కూలీలతో వెళ్తున్న ఒక ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది.
ఈ ప్రమాద సమయంలో రెండు ఆటోలలో మొత్తం సుమారు 35 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడగా, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని వెంటనే పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు నాగమహేశ్వరి కృష్ణారెడ్డి, వైద్య సంజీవ్ క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
ఘటనపై పెద్ద దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

NO COMMENTS

Exit mobile version