Home South Zone Andhra Pradesh ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ పొందే ఛాన్స్!

ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ పొందే ఛాన్స్!

0

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదలయ్యాయి. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ప్రైవేట్ వెబ్‌సైట్లను నమ్మవద్దని, ఏవైనా తప్పులుంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు సమయానికి హాల్ టికెట్లు పొంది పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ కోరింది.

NO COMMENTS

Exit mobile version