Home South Zone Telangana కొత్త బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|

కొత్త బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బిఅర్ఎస్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేడు కొత్తబస్తీ ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా జలమండలి (HMWSSB) జీఎం సునీల్, డీజీఎం శేఖర్, ప్రేమ్, పిళ్లై, ప్రవీణ్ తదితర అధికారులతో కలిసి ఆమె స్థానిక సమస్యలను పరిశీలించారు.

ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పాత డ్రైనేజీ లైన్లు మాటిమాటికీ పూడుకుపోతుండటంతో కొత్త పైపులైన్ వేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
వెంటనే దీనికి సంబంధించిన అంచనాలను (Estimates) సిద్ధం చేసి, ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేయించాలని జీఎంను కోరారు.
అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సమస్యలను పరిష్కరించే దిశగా తాను ప్రయత్నిస్తానని వారికి హామీ ఇచ్చారు.

#Sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version