హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TFJA) కీలక నిర్ణయం తీసుకుంది.
అసోసియేషన్ సభ్యుడు వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ)ను మూడు నెలల పాటు అసోసియేషన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కార్యవర్గం ప్రకటించింది.
గత కొంతకాలంగా సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా తోటి జర్నలిస్టులను కించపరిచే విధంగా, వారి వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వి.ఎస్.ఎన్. మూర్తి పోస్టులు చేస్తున్నట్లు అసోసియేషన్ దృష్టికి వచ్చింది.
దీనిపై విచారణ జరిపిన అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ, ఆయన ప్రవర్తన జర్నలిజం విలువలకి మరియు అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని నిర్ధారించింది.
ఈ మేరకు అసోసియేషన్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను, ఆయన సభ్యత్వాన్ని తక్షణమే మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
వృత్తిపరమైన గౌరవాన్ని కాపాడుకోవాలని, తోటి జర్నలిస్టుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని ఈ సందర్భంగా అసోసియేషన్ తన సభ్యులకు సూచించింది.
#sidhumaroju
Alwal
