Home South Zone Andhra Pradesh వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

0

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు.

ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.
#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version