Home South Zone Telangana సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|

సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూరారం ఎస్హెచ్ఓ (SHO) సుధీర్ కృష్ణ పిలుపునిచ్చారు.
బుధవారం సూరారంలోని సాయిబాబా నగర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా బ్యాంక్ వివరాలు, ఓటీపీ (OTP) లు అడిగే గుర్తుతెలియని ఫోన్ కాల్స్ నమ్మవద్దని సూచించారు.
నకిలీ లింకులు క్లిక్ చేయడం, లోన్ యాప్స్ బాధితులుగా మారవద్దని హెచ్చరించారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెనువెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా.. www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని కోరారు.
గోల్డెన్ అవర్ (మోసం జరిగిన వెంటనే) లో ఫిర్యాదు చేయడం వల్ల పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version