బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ వినతిపత్రం అందించారు. ముస్లిం మైనార్టీలు సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న ఈద్గా మైదానం సరిపోవడం లేదని, ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతోందని అయూబ్ ఖాన్ తెలిపారు. అధికారులు ఈ విషయంపై స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు
# కొత్తూరు మురళి.
