వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్సార్ఎస్పీ కెనాల్ నీటి ప్రవాహం తగ్గడంతో మృతదేహం మత్స్యకారుల కంటపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా అదృశ్యమయ్యారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.










