APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

0
0

ఏపీలో ఈసారి వేసవి ఎండలు నిప్పులు చెరగనున్నాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.

ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అత్యవసర సమయాల్లో ప్రజలు 112, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.