ఏపీలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు నూతన విధానాన్ని ప్రకటించారు. మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ఆర్థిక సాయంతో పాటు, ఉచిత విద్య, పౌష్టికాహార సాయం అందించాలని ప్రతిపాదించారు.
తల్లులకు ఏడాది పాటు ప్రసూతి సెలవులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనాభా సమతుల్యత అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు.
