నగరంలోని లేబర్ అడ్డాలు ఆకలి కేకలకు వేదికవుతున్నాయి. వేల సంఖ్యలో కూలీలు పని కోసం తెల్లవారుజామునే రోడ్లపైకి చేరుతున్నారు. యంత్రాల వాడకం పెరగడం, నిర్మాణ రంగంలో మందగమనం వల్ల వీరికి పని దొరకడం గగనమైంది.
“పని దొరికితేనే ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలుగుతుంది, లేదంటే పస్తులే” అని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యేక భరోసా కల్పించాలని, అడ్డాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.










