శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ మార్గం ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది.
కానీ అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఏ వాహనం అటుగా రాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. అయితే, ఈ సంఘటన వలన ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది
# కొత్తూరు మురళి.










