దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో రాజగోపుర నిర్మాణానికి మాజీ మంత్రి నెట్టెం రఘురాం శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజగోపురం ఆలయ వైభవాన్ని మరింత పెంపొందిస్తుందని తెలిపారు.
గతంలో తన హయాంలోనే ఆలయ పునర్నిర్మాణం జరగడం, ఇప్పుడు గోపుర నిర్మాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










