ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల కుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. శనివారం యాగశాలలో కలశస్థాపన, మూలమంత్ర హవనాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆదివారం ఉదయం 9:34 గంటలకు కంచి పీఠాధిపతుల సమక్షంలో ప్రధాన ఆలయ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించనున్నారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ అరుదైన క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.










