పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం వైసిపి రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసిపిలో చేరాయి.
బూరగమంద క్రాస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం శ్రమించే వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.










