ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం.
సమయం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష, అనంతరం 10 గంటల నుండి ప్రజల నుండి అర్జీల స్వీకరణ ఉంటుంది. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌కు అర్జీదారులు ఎవరూ రావద్దని, అన్ని శాఖల జిల్లా అధికారులు చీరాలలోనే అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు.
చీరాల రాలేని వారు తమ పరిధిలోని తహశీల్దార్ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చు అని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.










