C M revanth redsy meets America delavr city governor

0
1

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మాట్ మేయర్ గారు ముఖ్యమంత్రి గారికి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు డెలావర్ గవర్నర్ గారికి ‘తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.