పుంగనూరులో ఈనెల 14న ఎమ్మెల్యే, ఎంపీల ఇఫ్తార్ విందు!

0
0

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పట్టణంలోని ముస్లిం సోదరులకు ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా తెలిపారు.

ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లింలకు ఈ విందు ఏర్పాటు చేశారు. అంజుమన్ షాదీ మహల్లో జరిగే ఈ ఇఫ్తార్ విందుకు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు

# కొత్తూరు మురళి.