Home South Zone Telangana పారి స్థాయిలో లొంగిపోయిన మావోయిస్టు

పారి స్థాయిలో లొంగిపోయిన మావోయిస్టు

0

హింసను వీడి శాంతి మార్గంలో పయనించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 130 మంది మావోయిస్టులు 124 అత్యాధునిక ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు. వీరిలో కీలకమైన రాష్ట్ర, రీజినల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, లొంగిపోయిన వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 2024 జనవరి నుండి ఇప్పటివరకు 721 మంది లొంగిపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

చట్టపరమైన చిక్కులను తొలగించి, మాజీ మావోయిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు, ఆర్థిక ప్యాకేజీ అందజేస్తామని స్పష్టం చేశారు. అగ్రనేత గణపతి కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ వేదికగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

NO COMMENTS

Exit mobile version