పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు శనివారం 10 పబ్లిక్ పరిష ప్రశ్నాపత్రాలు చేరుకున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ ప్రశ్నాపత్రాలను ట్రంకు పెట్టెలలో పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు.
హెచ్ఎం అమర్ శేఖర్, ధనలక్ష్మి కస్టోడియన్లుగా వ్యవహరిస్తారని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. రూట్ ఆఫీసర్లుగా పులిచెర్ల, రొంపిచర్ల ఎంఈఓలు తాతయ్య, సిద్ధరామయ్య, శ్రీనివాసులు ఉంటారని ఆయన చెప్పారు. రొంపిచర్ల బాయ్స్, గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ తెలిపారు .
# కొత్తూరు మురళి.










