మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్థానికులే స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో, స్థానికులు స్వయంగా ముందుకు వచ్చి బాధితుడిని అత్యవసర విభాగానికి తరలించారు.
ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చోటుచేసుకుంది.










