ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.

0
0

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై అనుచితంగా ప్రవర్తించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, వారితో కూడా బూతులు మాట్లాడాడు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని స్థానికులు అనుమానిస్తున్నారు.