మదనపల్లె చలపతిరావు కాలనీలో గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూములు నిర్మించడాన్ని కాలనీ నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్మాణం వల్ల దుర్వాసన, అస్వచ్ఛతతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశం పవిత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు.
