అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా రైతులు తమ పంటలను సులభంగా విక్రయించుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు
# కొత్తూరు మురళి .










