అమెరికా ఆధిపత్య ధోరణిని ప్రపంచ దేశాలు ఐక్యంగా నిలువరించాలని మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ. గఫూర్ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
ట్రంప్ విధానాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. చమురు నిల్వలున్న దేశాలపై దాడులు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం భారత్ కు గర్వకారణం కాదని విమర్శించారు.
గల్ఫ్ లోని భారతీయుల రక్షణ కోసం అమెరికా సైనిక స్థావరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. పలు పార్టీల నేతలు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో ట్రంప్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
