నంద్యాల జిల్లా
* డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.
* రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి.
* సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం.
* ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని తెలిపిన హార్టికల్చర్ అధికారులు.
* పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశం.
* కవర్ కట్టిన పండ్ల నాణ్యత.. కవర్ లేని పండ్ల నాణ్యతను పరిశీలించిన ముఖ్యమంత్రి.
* జిల్లాలో మంచి రేట్ వచ్చే వివిధ వెరైటీల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం సూచన.
* జిల్లాలో భూగర్భ జలాల పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచన.
