మార్కాపురం జిల్లాలో దళితుల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంపై దళిత నాయకుడు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. దళితుల పట్టా భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు.
ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు రిలీఫ్ పంపిణీలో తహసీల్దార్లు జాప్యం చేయకుండా చూడాలని, స్మశాన వాటికల కోసం భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జయంపు కృష్ణయ్య హత్య కేసు బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు, వీసీకే పార్టీ నేతలు పాల్గొన్నారు.










