మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొని బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, సైబర్ నేరాలు, మహిళల వేధింపులపై అందిన వినతులను పరిశీలించి.
వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, బాధితులకు న్యాయం జరిగే వరకు బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.










