అమరావతి రాజధాని పనులపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో క్రీడలు అతిపెద్ద వాణిజ్య శక్తిగా మారుతాయని, బీసీసీఐ తరహాలో అమరావతి స్పోర్ట్స్ సిటీని లాభదాయక ప్రాజెక్టుగా మలచాలని అధికారులకు సూచించారు.
నీరుకొండలో భారీ టూరిజం ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్దాలని, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా కల్చరల్ సెంటర్ నిర్మించాలని ఆదేశించారు. రాజధానిలో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమని పేర్కొన్నారు.
సచివాలయ టవర్ల పనులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సీఆర్డీఏ అథారిటీ ఈ సమావేశంలో ఆమోదం తెలిపింది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
