Home South Zone Andhra Pradesh విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష

విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష

0

విజయవాడ ధర్నా చౌక్‌లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరాహార దీక్ష జరిగింది. ఉప్పర నాగేశ్వరరావు, విజయ ఉత్తరాది నేతృత్వంలో సాగిన ఈ నిరసనకు వైసీపీ నేత తోలేటి శ్రీకాంత్ సంఘీభావం ప్రకటించారు. బీసీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు కట్టాలని డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version