వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

0
1

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.
నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను హెచ్చరించారు.

భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా బాణసంచా తయారీ కేంద్రాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేట్లపాలెం ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని ప్రమాదకర పరిశ్రమలపై కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.