Home South Zone Andhra Pradesh అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.

అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.

0

అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ, హెచ్‌ఐవి/ఎయిడ్స్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో హెచ్‌ఐవి నివారణ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని, బాధితులు వైద్యానికి దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నాకో మార్గదర్శకాల ప్రకారం అవగాహన సదస్సులు నిర్వహించి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించారు.

NO COMMENTS

Exit mobile version